¡Sorpréndeme!

Anant Ambani Rescue Hens From Cages | అత్తారింటి దారేదిలో పవన్ లా..మొత్తం కొనేసిన అనంత్ అంబానీ | ABP Desam

2025-04-01 0 Dailymotion

 అపర కుబేరుడు..లక్షల కోట్లకు అధిపతైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ద్వారక శ్రీకృష్ణుడి దర్శనం కోసం పాదయాత్ర చేస్తున్నారు. తన పుట్టినరోజైన ఏప్రిల్ 10 వ తారీఖుకు ద్వారకకు వెళ్లేలా 160కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించిన అనంత్ అంబానీ...మార్గ మధ్యంలో అందరినీ షాక్ కి గురి చేసేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. ద్వారక రోడ్డులో నడుస్తున్నప్పుడు తన పక్క నుంచి ఓ కోళ్ల వ్యాన్ వెళ్లటం గమనించారు అనంత్ అంబానీ. తన సెక్యూరిటీకి చెప్పి ఆ బండిని ఆపించిన అనంత్ అంబానీ వెనుకాల పంజరాలను ఓపెన్ చేసి కోడిని బయటకు తీయమన్నాడు. దాన్ని చేతితో తాకి వీటన్నింటిని ఎక్కడకు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. షాపులో చికెన్ అమ్మటానికి ఈ కోళ్లను తీసుకువెళ్తున్నామని డ్రైవర్ చెప్పగా...అనంత్ అంబానీ బాధపడ్డారు. ఇవంత ఎంత రేట్ ఉంటాయని అడిగి..ఆ డబ్బు ఇచ్చి డ్రైవర్ ను ఈ కోళ్లంటినీ జామ్ నగర్ దగ్గరలో ఉన్న వంతారా కు పంపించాలని ఆదేశించారు అనంత్ అంబానీ. వంతారా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద జంతు పరిరక్షణ, చికిత్స కేంద్రం. అక్కడ ఏనుగులు, సింహాలు, పులులు సహా గాయపడిన అనేక జంతువులకు వైద్యం అందించి తిరిగి వాటిని మాములు జీవులుగా చికిత్సను అందిస్తారు. సో అక్కడికి ఈ కోళ్లను పంపటం ద్వారా వీటి ప్రాణాలు కాపాడాలని ఆలోచించారన్న మాట అనంత్ అంబానీ. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్  రైల్వే స్టేషన్ ను కొనేయాలని పీఏకు చెప్పినట్లు...తన కళ్ల ముందు నుంచి కోళ్లు చనిపోవటానికి వెళ్తుంటే చూడలేక వాటన్నింటిని కొనేసి తన జంతు ప్రేమను చాటుకున్నారు అనంత్ అంబానీ.